బెంగుళూరులో రికార్డు సృష్టించిన ‘వర్షం’

'Rain' creates a record in Bangaloreన‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. జూన్‌ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా జూన్‌ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3 ఎంఎం) ఇప్పటికే దాటేసినట్లు తెలిపారు. నగరంలో చివరిసారి 1891 జూన్‌ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో జల సంక్షోభాన్ని బెంగళూరు ఇటీవల ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నీటివృథాపై అధికారులు జరిమానాలూ విధించారు. ఈ క్రమంలోనే నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి.

Spread the love