ఫ్లోరిడాలో వర్షం.. టాస్ ఆలస్యం

నవతెలంగాణ – హైదరాబాద్:  టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం ఏర్పడింది. ఫ్లోరిడాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. ఒకవేళ వర్షంతో ఈ మ్యాచ్ రద్దయితే ఇరుజ‌ట్ల‌కు చెరొక పాయింట్ ఇస్తారు. అప్పుడు 5 పాయింట్లతో అమెరికా సూప‌ర్-8కు వెళ్తుంది. త‌ర్వాతి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిచినా నాలుగు పాయింట్లతో ఆ జట్టు ఇంటి బాట పడుతుంది.

Spread the love