హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం…

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్‌, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది. బహదూర్‌పల్లిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురుస్తున్నది. నగరంలో వర్షం పడుతుండంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో శనివారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కింది స్థాయి గాలుల ప్రభావంతో మూడు నాలుగు రోజుల నుంచి నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గరిష్ఠం 42.4, కనిష్ఠం 30.0 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 25 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love