హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం…

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్‌, కొండాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, బేగంపేట, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌ పలుచగా చినుకులు పడ్డాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్‌లో కూడా వర్షం కురిసింది. ఉదయం నుంచి నగరం మొత్తం వేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చిరుజల్లులు కురవడంతో గత వారం రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.

Spread the love