ఒకవైపు వర్షం మరోవైపు రోడ్డు పనులు

– నవ్వుతున్న ప్రజలు

– రోడ్డుపై రోడ్డు వేయడం ఎవరి సొమ్ము
– వర్షంలో రోడ్డు వేసి ఉపయోగం ఏంటి
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గత వారం రోజుల క్రితం రోడ్డు (హైవే ఎన్ హెచ్ 44) పనులను ప్రారంభించారు. కానీ సోమవారం రోజు ఒకవైపు వర్షం కురుస్తుండగా మరోవైపు రోడ్డు వేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుతున్నారు. రోడ్లను ఎవరి సొమ్ముతో వేస్తున్నారని ప్రజలు తాము కట్టే ఇతరత్రా సొమ్ముతో రోడ్లను వర్షంలో వేయడం వల్ల ఉపయోగం ఏంటని జిల్లా కేంద్రంలోని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. స్థానిక మేయర్ దండు నీతూ కిరణ్ ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. లేని చట రోడ్లు వేయమంటే ఉన్నచోట రోడ్లు వేసి చేయిలు దులుపుకుంటున్నారు. ప్రజలకు అవసరమున్న రోడ్లు వేయాలని కోరుతున్నామన్నారు.
Spread the love