నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షంతో పాటు గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక, హైదరాబాద్ నగరానికి కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం నుంచి వర్షాలు పడతాయని, కొన్నిరోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.