నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.