నవతెలంగాణ – వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. లాకర్‌లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.10 కోట్ల విలువచేసే బంగారాన్ని అపహరించినట్లు తెలిసింది. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దింపి విచారణలో వేగం పెంచారు.