నవతెలంగాణ – సారంగాపూర్: మండలంలోని జౌలీ గ్రామానికి చెందిన మర్రిపెద్ద లింగయ్య (31)అను రజకుడు కుల వృత్తిలో బాగంగా స్వర్ణ డ్యాం వద్ద బట్టలు ఉతుకేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు లింగయ్య ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో గల స్వర్ణ ప్రాజెక్టు డ్యాం వద్ద బట్టలు ఉతి కేందు వెళ్ళాడు రాత్రి ఐన ఇంటికి రాలేదు సోమవారం కుటుంబీకులు స్వర్ణ ప్రాజెక్టు సమీపంలో వెతుకు తుండగా ప్రాజెక్టు గేట్ల వద్ద మృతదేహం కనిపించింది. మృతుని భార్య సురేఖ పోలీసులకు పిరియదు చేయగా కేసు నమోదు చేసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.మృతునికి మృచ్ఛ రోగం ఉంది బట్టలు ఉతికే సమయంలో ఫిట్స్ రావడం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృత దేహాన్ని జాలరుల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు కుమారుడు, కుమార్తె ఉన్నారు.