– ఘనంగా ఇంటి దీపం ప్రొడ్యూసర్స్ పరస్పర సహాయ సహకార సంఘ 22వ మహా జనసభ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
మహిళలు ఆర్థికంగా ఎదిగి, తమ కుటుంబానికి అండగా నిలవాలని అధ్యక్షురాలు రాజమణి పేర్కొన్నారు. డిచ్ పల్లి ఇంటి దీపం ప్రొడ్యూసర్స్ పరస్పర సహాయ సహకార సంఘం 22 వార్షిక మహాజన సభ మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలోని ఇస్లాంపుర ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. నూతన అధ్యక్షులను డైరెక్టర్లు ఎన్నుకున్నారు. అనంతరం ఓవర్ డ్యూ లేకుండా అప్పులు చెల్లించిన సభ్యులకు ఘనంగా సన్మానించి కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమం బంగ్లా రాజమణి అధ్యక్షతన ఈ మహాజనసభ నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి, తమ కుటుంబానికి అండగా నిలవాలని అధ్యక్షురాలు రాజమణి పేర్కొన్నారు. వార్షిక నివేదికలో డిచ్పల్లి ఇంటి దీపం మ్యాక్స్ లో 1650 మంది సభ్యత్వం కలిగి ఉన్నారనీ, వీరి యొక్క వాటదనం 73,14,790 లక్షల రిజర్వు నిధులు,37,46,667 లక్షల మొత్తం సొంత నిధులు,1,10,61,458 కోట్ల సొంత నిధులు ఉన్నట్లు, మొత్తం సభ్యులపై అప్పులు 912 మంది పైన 90,60, 017 లక్షల సభ్యులు అప్పు ఉన్నట్టు మేనేజర్ సర్వోన్నత రావు సభ్యులకు చదివి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు పోగా సంఘానికి 7,24,245 లక్షల రూపాయలు మిగులు వచ్చినదనీ,అదేవిధంగా జాతీయ పెన్షన్ పథకం కింద 115 మందిపై ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఇందూర్ ఇంటి దీపం మ్యాక్స్ ఫెడరేషన్ కు పంపించామని, 60 సంవత్సరాల నిండిన 15 మందికి, NPS పథకం కింద 2,61,733 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగినదనీ,ముగ్గురు మ్యాక్స్ సభ్యులు చనిపోగా, ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించామన్నారు. ఈ సమావేశంలో 2022-2023 వార్షిక నివేదిక, ఆడిటర్ నివేదిక,2023-2024 బడ్జెట్ కార్యక్రమాల ప్రణాళిక, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2022-2023 సభ్యులకు చెల్లించిన డివిడెంట్ 2,89,698 లక్షల రూపాయలు సభ్యులకు వాటాదనంకు కలపడం జరిగినదనీ, వాటదనం వంద రూపాయలకు 1.65 శాతం చొప్పున (పోషకత్వ రిబేట్ ) అప్పు తీసుకున్న వారికి 100 రూపాయలకు రెండు 2.34 శాతం చొప్పున డివిజన్ సభ్యులకు కలిపారన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 8,81,000 మిగులు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు బంగ్లా రాజమని తోపాటు, మేనేజర్ సర్వోన్నత రావు, కోఆర్డినేటర్ సంతోషి, స్వప్న, అకౌంటెంట్ కళ్యాణ్, మరియు మాక్లూరు అధ్యక్షురాలు చిన్నుబాయి, మేనేజర్ గంగా నరసయ్య వీరితోపాటు సుమారు వందకు పైగా సభ్యులు పాల్గొన్నారు.