టాస్ గెలిచిన రాజస్తాన్.. పంజాబ్ బ్యాటింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో ఉన్న అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్లలో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

Spread the love