ఆర్జీ-3 సివిల్ డీజీఎం గా రాజేంద్ర కుమార్

Rajendra Kumar as RG-3 Civil DGMనవతెలంగాణ – రామగిరి 
ఆర్జీ-3 సివిల్ డీజీఎం గా బి. రాజేంద్ర కుమార్ ను నియమిస్తూ శుక్రవారం యజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీజీఎం పివిఎన్ పద్మరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇక్కడే పని చేస్తున్న డీ.వై.ఎస్ఈ పెద్దడ రాజేంద్రప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఇక్కడికి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న డి జి ఎం రాజేంద్ర కుమార్ ను బదిలీ చేశారు. సివిల్ ఎస్.ఈ బానోత్ రాము ను  శ్రీరాంపూర్ డివిజన్ నుండి మందమర్రి డివిజన్ కు, ఈఈ సాయినాథ్ సిండేను ఆర్జీ-3 డివిజన్ నుండి కొత్తగూడెం జీఎం సివిల్ కార్యాలయానికి, ఏఈ బైరి క్రాంతిని  కొత్తగూడెం లోని సివిల్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Spread the love