– 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామానికి చెందిన అక్క రాజిరెడ్డి(32)ఇటీవల మృతి చెందారు. ఆకారం గ్రామంలోని జడ్పీహెచ్ హైస్కూల్లో చదువుకున్న 2005-06 బ్యాచ్ చిన్ననాటి మిత్రులు ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్షించారు. అనంతరం వారి కుటుంబానికి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 2005-06 బ్యాచ్ మిత్రులు మాట్లాడుతూ తమ చిన్ననాటి స్నేహితులు అక్క రాజి రెడ్డి మృతి చెందడం బాధాకరమని, వారీ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అంతక ముందు ఆయనతో స్కూల్లో చదువుకున్న చిన్ననాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్నారు.కార్యక్రమంలో చిన్న నాటి మిత్రులు దేవిరెడ్డి, జనార్దన్, క్రాంతి, సాగర్,వేణు షాదుల్, దాసు,భార్గవ్ తదితరులు పాల్గోన్నారు.