నవతెలంగాణ హైదరాబాద్: విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్(ఓసీసీ)ను ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ గురువారం సందర్శించారు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రోరైలు సంస్థ అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చి చాలా సమయం గడిపారు. సంస్థ ఎండీ కేవీబీరెడ్డి, సీఓఓ సుధీర్ చిప్లూలంకర్, సీఎస్ఓ మురళీ వరదరాజన్ హైదరాబాద్ మెట్రోరైలు ఆపరేషన్స్‌లో కీలకమైన ఓసీసీ గురించి రజనీకి వివరించారు. అక్కడి సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.