నవతెలంగాణ – చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీహత్య కేసులో నిందితుడు సుతేంద్రరాజా అలియస్ శంతన్ చెన్నైలో మృతిచెందారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో అతను ఒకడు. శ్రీలంక జాతీయుడైన శంతన్.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈరోజు తెల్లవారుజామున 7.50 నిమిషాలకు అతనికి గుండెపోటు వచ్చినట్లు ఆస్పత్రి డీన్ డాక్టర్ వీ.తేరనిరాజన్ తెలిపారు. కాలేయం దెబ్బతినడంతో చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు. వాస్తవానికి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటు వచ్చినప్పుడు అతనికి సీపీఆర్ చేసినట్లు వెల్లడించారు. కానీ మళ్లీ 7.50కి పోటు రావడంతో అతను చనిపోయినట్లు చెప్పాడు.