భిక్కనూరులో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి


నవతెలంగాణ-భిక్కనూర్: భిక్కనూరు పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, నాయకులు బాబు, మహేందర్, నవీన్ గౌడ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Spread the love