
సేవ కార్యక్రమాలే ధ్యేయంగా పని చేస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ బుధవారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు, చదువులో ముందున్న విద్యార్థిని విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు, పలు రకాల ఇబ్బందులతో ఉన్న వారిని గుర్తించి రోటరీ ద్వారా సహాయం సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు.