మున్నూరుకాపు సంఘం-తెలంగాణ మండల అధ్యక్షుడుగా మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన బండ రాజ్ కుమార్ పటేల్ ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పటేల్,రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ పటేల్ లు మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, కన్వీనర్ లతోపాటు మున్నూరు కాపు సంఘం నాయకులకు రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంఘం ఐక్యత, పటిష్ఠతకు తనవంతుగా కృషి చేస్తూ సంఘం ఆశయాల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని ప్రకటించారు.