రాజుగారి కోడిపులావ్‌

ఏఎమ్‌ఎఫ్‌, కోన సినిమా బ్యానర్లపై అనిల్‌ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తూ, శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్‌’ కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ, అలాగే సినిమా అవుట్‌ లైన్‌ కూడా తెలిపే ఒక వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మిగిలిన క్యారెక్టర్లను కూడా ఈ వీడియోలో పరిచయం చేసారు. నేహా దేశ్‌ పాండే ఈ చిత్రంలో ఆకాంక్షగా నటించగా, బద్రిగా కునాల్‌ కౌశల్‌, క్యాండీగా ప్రాచీ కెథర్‌, ఈషాగా రమ్య దేష్‌, ఫరూక్‌గా అభిలాష్‌ బండారి తదితరులు నటించారు. రీయూనిన్‌తో కలిసిన ఆరుగురు స్నేహితులు రిఫ్రెష్‌ నెస్‌ కోసం సరదాగా గడపడానికి ఒక డెస్టినేషన్‌ (అడవిలో ఒక ప్రాంతానికి) ఎంచుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురౌవుతాయి.
ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడు కోవడానికి వాళ్ళు చేసే పోరాటమే ఈ సినిమా. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌గానే కాకుండా అందమైన లవ్‌ స్టొరీని కూడా ప్రేక్షకులకు మేకర్స్‌ చూపించబోతున్నారు.

Spread the love