మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం 

నవతెలంగాణ- కంటేశ్వర్

మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల సదన్ పిల్లలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి,అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి రెవెన్యూ కి,చిత్రా మిశ్రా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కి, ఎమ్మెల్యే భిగాల గణేష్ గుప్తాకి బేటి బచావో బేటి పడావో లోగో రాఖీలను కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సూపరిండెంట్ మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త  బాల సదన్ సూపర్డెంట్  మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బాలసదన్ విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది.
Spread the love