సమస్యలు పరిష్కరించాలంటూ వినాయకుడితో ర్యాలీ

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినాయకుడితో అంగన్వాడి టీచర్లు ఆయాలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా వినాయక విగ్రహంతో ర్యాలీ నిర్వహిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ‌. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంగన్వాడి టీచర్లను ఆయాలను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అంగన్వాడి టీచర్లు ఆయాలు 100 మంది వరకు పాల్గొన్నారు
Spread the love