వాడికి కోపం వస్తే..రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు నేడు సరైన ట్రీట్ లభించింది. రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం నుంచి నేడు టీజర్ రిలీజ్ చేశారు. యూపీ రాజధాని లక్నో సిటీలో జరిగిన భారీ ఈవెంట్ లో ‘గేమ్ చేంజర్’ టీజర్ ను రామ్ చరణ్, ఇతర యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు. నిన్ననే టీజర్ ప్రోమో రిలీజ్ చేసి అభిమానులను ఉత్సాహపరిచిన మేకర్స్… నేడు టీజర్ రిలీజ్ చేసి వారిని మరింత సంతోషపెట్టారు.
“బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు… కానీ, వాడికి కోపం వస్తే… వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు” అనే పంచ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఎటు చూసినా భారీతనం, కనుల విందు చేసే విజువల్స్, అదిరిపోయే స్టంట్స్, థ్రిల్స్… ఇలా ‘గేమ్ చేంజర్’ టీజర్ ను మేకర్స్ ఓ పవర్ ప్యాక్ లా నింపేశారు. “అయాం అన్ ప్రెడిక్టబుల్” అంటూ రామ్ చరణ్ టీజింగ్ గా చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది.
మొత్తమ్మీద ఇదొక ఎన్నికల కథాంశంతో తెరకెక్కిన చిత్రం అని అర్థమవుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక కాగా… అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.
దిల్ రాజు పర్యవేక్షణలో రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Spread the love