నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం ధూపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో గత వారం రోజులుగా రామనామ స్మరణ సప్తహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రామ నామస్మరణతో భజన కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని పెద్దలు యువత కలసికట్టుగా విడతల వారీగా భజన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని గ్రామ కమిటీ అధ్యక్షులు లింగన్న యాదవ్ పేర్కొన్నారు. గత ఏడు రోజులుగా ఆలయంలో రాత్రి పగలు తేడా లేకుండా భజన కార్యక్రమాలను చేపట్టి చివరి రోజు అయిన సోమవారం సప్తహ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సన్మానం చేయడం జరిగిందన్నారు, అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాబన్న ,పోశెట్టి, గోపాల్ రెడ్డి, దేవేందర్, గంగాధర్, గంగారెడ్డి, లక్ష్మణ్, గంగరాజు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.