ప్రభాస్, కృతిసనన్ సీతారాములుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ చిత్రం నుంచి సీతారాముల ప్రేమలోని గాఢతను తెలియజేసే ‘రామ్ సీతా రామ్’ మెలోడియస్ సాంగ్ పూర్తి ట్రాక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సచేత్-పరంపర స్వరపరచిన ఈ పాట మధురమైన స్వరాలతో నెమ్మదిగా సాగుతూ హృదయాలను తాకేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం.. సీతారాముల మధ్య పంచుకున్న లోతైన అనుబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. మంత్రముగ్ధులను చేసే సంగీతం, శ్రావ్యమైన గాత్రాలు, సీతమ్మ, రామయ్య మధ్య సాగే ప్రేమానుబంధాల విజువల్ ట్రీట్ వెరసీ.. ఈ పాట అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రం జూన్ 16న విశ్వ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : సచేత్-పరంపర, నిర్మాతలు : టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, దర్శకత్వం : ఓమ్ రౌత్