ఉద్యోగులు పని చేసినచోట ప్రజా మన్ననలు పొందాలి: రామారావు నాయక్

నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
ఉద్యోగస్తులకు బదిలీలు సహజమని మనం పనిచేసిన చోట సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ అన్నారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా విశిష్ట సేవలు అందించి సంగారెడ్డి జిల్లాకు బదిలీ పై వెళ్తున్న  బెల్లంకొండ శ్రీధర్ గౌడ్  ఆత్మీయ వీడుకొలు సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశం లొ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగంలో బదిలీలు సహజమని ప్రతి ఒక ఉద్యోగి నిబద్ధతతో పని చేస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సూర్యపేట జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా శాఖ అభివృద్ధి కి రైతుల శ్రేయస్సు కోసం శ్రీధర్  విశేషంగా  కృషి చేశారాన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ గౌడ్ ను ఉద్యాన శాఖ సిబ్బంది, పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ సిబ్బంది, డ్రిప్ కంపెనీ సిబ్బంది తో పాటు వివిధ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పట్టుపరిశ్రమ  జిల్లా అధికారి ఎస్ వీరకుమార్, ఉద్యాన అధికారులు కన్నా జగన్, స్రవంతి, అనిత, టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, కె వి కె రైతు మిత్ర వ్యవస్థాపకులు ఉపేందర్ రెడ్డి, ఆయిల్ ఫామ్ కంపెనీ మేనేజర్ జె హరీష్, సూపరిండెంట్ నరహరి, ఏవో మురళి, నరేష్, నరేందర్,ఝాన్సీ, సిబ్బంది రంగు ముత్యం రాజు, భద్రాచలం, సుధాకర్ రెడ్డి, వెంకట్ సుధాకర్,  సాయి, మల్లేష్ అనిల్ సైదులు నరసింహ గణేష్ తో పాటు పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love