రామన్నగూడెంలో ట్రాక్టర్ యూనియన్ కమిటీ కాంగ్రెస్ పార్టీలో చేరిక

– కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి
నవతెలంగాణ నెల్లికుదురు: మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యూనియన్ సభ్యులు 30 మంది, మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ మండల నాయకుడు భాను ప్రసాద్ తో 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ ప్రధాన కార్యదర్శి కాసం చిన్న లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ ఆధ్వర్యంలో వారికి కండవల్లి కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి కుంట్ల మౌనేందర్, రత్నాపురం యాకయ్య, మాజీ ఎంపీటీసీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love