రామస్వామి మరణం పార్టీకి తీరని లోటు

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
రామస్వామి మరణం సీపీఐ(ఎం)కు తీరని లోటు అని పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, సింగరేణి ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు అన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు వందల రామస్వామి అకాల మరణం చెందగా మంగళవారం ఆయన మృతదే హానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి ప్రకటించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇల్లందులో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నుంచి ఉద్యోగం వచ్చేవరకు విద్యార్థి రంగంలో పనిచేసినట్టు చెప్పారు. ఉద్యోగరీత్యా భూపాలపల్లికి వచ్చిన వంగల రామస్వామి సింగరేణి ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ)లో పనిచేస్తూ కార్మికుల కోసం నిరంతరం కృషి చేశాడని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడిస్థాయికి ఎదిగి నిత్యం ప్రజలతో మమేకమై తుదిశ్వాస వరకు ప్రజా తంత్ర ఉద్యమంలోనే కొనసాగాడన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా రామస్వామి, ఆయన భార్య లక్ష్మి మహిళా సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. సింగరేణి ఎంప్లాయిస్‌ యూనియన్‌లో బ్రాంచ్‌ కార్యదర్శి నుంచి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు వరకు సొంత కృషితో రామస్వామి ఎదిగారని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మనీయమని అన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య , జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, గుర్రం దేవేందర్‌ శ్రీకాంత్‌ , పార్టీ సభ్యులు బంధు క్రాంతి సుజాత రవికుమార్‌ రాజేందరు శ్రావణ్‌ శ్రీధర్‌ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love