అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రమేష్ బాబు

నవతెలంగాణ- ఆర్మూర్ 

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26000 చెల్లించాలి అని ,,గ్రాటివిటీ అమలు పర్మినెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11 నుంచి నిరవధిక  సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు  ఈ సందర్భంగా మంగళవారం మండల తహసిల్దార్ కార్యాలయ. డిప్యూటీ తాసిల్దార్ కు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని 26000 ఇవ్వాలని ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాటివీటి చెల్లించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని అన్నారు.. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి 60 సంవత్సరాలు తర్వాత అంగనవాడి ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్ కోరితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షలు చెల్లించాలని అన్నారు. గత నిబంధనల ప్రకారం ఎస్ ఎస్ సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. సీనియార్టీని బట్టి వ్యత్యాసం ఉండాలి ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలి బిఎల్ఓ డ్యూటీ లో రద్దు చేయాలి, ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులను చేయించకూడదు మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తిస్తూ ప్రకటించిన సర్కులర్ ను వెంటనే జారీ చేయాలి, ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి, పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించాలి, 2018 అక్టోబర్ కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు 1500 హెల్పర్లకు 750 రూపాయలు మినీ వర్కర్లకు 1250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏరియాస్తో సహా చెల్లించాలి 2017 నుండి టీఏడీఏ ఇంక్రిమెంట్ ఇన్చార్జ్ అలవెన్స్ బాకాయలు మొత్తం చెల్లించాలి దీనికి  సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి: కాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీలను పిల్లలకు ఒక్క రూపాయి 15 పైసలు నుండి ఐదు రూపాయలకు గర్భిణీ బాలింతలకు రెండు రూపాయల 40 పైసల నుండి పది రూపాయలకు పెంచాలి డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి ఎన్ హెచ్ టి ఎస్ ఈసీసీఈ యాప్స్ ను పూర్తిగా రద్దు చేయాలి పిఆర్సి ఏరియల్ 2021 జులై ,అక్టోబర్, నవంబర్ మూడు నెలల వెంటనే చెల్లించాలి అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి అంగన్వాడి ఉద్యోగులకు మట్టి ఖర్చులు 50 వేలు చెల్లించాలి అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రకళ గోదావరి సెక్టార్ లీడర్లు లక్ష్మి ,సునంద, పద్మా, లక్ష్మి, గోదావరి ,జగదాంబ, కవిత తదితరులు పాల్గొన్నారు..
Spread the love