కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు..

నవతెలంగాణ – అమరావతి: మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించిన ఆయన బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఆయన సొంతం. బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ వివాహం చేసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Spread the love