
పత్తి కొనుగోళ్లలో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఈనెల 6న బుధవారం రోజున సీసీఐ ఆధ్వర్యంలో పత్తి పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామ్నాథ్ సోమవారం ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి పంటకు క్వింటాలుకు మద్దతు ధర రూ.7521 ప్రకటించడం జరిగిందని, పత్తి పంట రైతులు ప్రైవేట్ పరంగా అమ్ముకొని మోసపోకుండా, మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం పంచుకోవాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి పత్తి రైతులను కోరారు.