నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు మీడియా మొఘల్‌గా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్‌గా మారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు.