కన్నుల పండుగగా రాములోరి చక్రతీర్థం..

– వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..
– వన విహారం చేసిన దేవతామూర్తులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి పొందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం సీతారామచంద్రులకు చక్రతీర్ధం కార్యక్రమం అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. ఆనంతరం సీతాసమేతంగా స్వామివారు వన విహారం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్యహోమం, అవభృతస్నానం నిర్వహించారు. ఆ తర్వాత చక్రతీర్థంను ఆశేష భక్తజనం మధ్య విశేషంగా నిర్వహించారు. సాయంత్రం గజసేవ, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్ధప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. మండలం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలను భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అంగడి మాముళ్లలో జరిగిన జాతరకు భక్తులు తండోపతండాలు వచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. జాతరలో తినుబండారాల దుకాణాలు, ఆటవస్తువు దుకాణాలు వెలిశాయి. పలువురు ఉయ్యాయలు ఊగుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఖిల్లారామాలయ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటి సభ్యులు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూరమాధురి, ఆసది జితేందర్, తాజా మాజీ సర్పంచి గడ్డం రాధకృష్ణారెడ్డి, బూస సుదర్శన్, ఎజీ దాసు, విండోమాజీ చైర్మెన్ గజవాడ జైపాల్, వీడిసి కోశాధికారి తోట చిన్నసాయిలు, వారాల సాయిలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Spread the love