ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మిక తనిఖీ

– మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అంబరీష
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి నిర్వహించినట్లు మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించి సంబంధిత రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపరచుకొని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేయాలని అన్నారు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు డెలివరీలు ప్రభుత్వ ప్రభుత్వ దావాఖానలోనే చేయించాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శాంతమ్మ హెచ్ ఈ ఓ వెంకటేశ్వర్లు యూ డి సి అనిల్ కుమార్ స్టాఫ్ నర్స్ పద్మ సూపర్వైజర్ సిహెచ్ మంగమ్మ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love