నిఘా సమక్షంలో ర్యాండమైజేషన్‌

– ఎన్నికల ఆధికారి శశాంక, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సాధారణ, పోలీస్‌ పరిశీలకుల సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక నిర్వహించారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా, వికారాబాద్‌ జిల్లాల పోలింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, పోలీస్‌ పరిశీలకులు కాలు రామ్‌ రావత్‌ల సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. జనరల్‌ అబ్జర్వర్‌ ర్యాండమైజేషన్‌ను నిశితంగా పరిశీలించారు. పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. జిల్లాలోని ఎనిమిది సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3306 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మొత్తం మొత్తం 15,224 మందిని పోలింగ్‌ విధుల కోసం నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో పోలింగ్‌ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల చొప్పున మహిళా బృందాలను, ఒక వికలాంగుల బందం, ఒక యువతతో కూడిన పోలింగ్‌ బందాలను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. పోలింగ్‌ సిబ్బందికి ఇప్పటికే ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్‌ ట్రైనర్స్‌ చే పోలింగ్‌ నిర్వహణపై మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, మే 1, 2వ తేదీలలో రెండవ విడత శిక్షణకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ శశాంక అబ్జర్వర్‌ల దష్టికి తెచ్చారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బందంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ సిబ్బంది ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమ సింగ్‌, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ స్నేహ, వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, ఉమా హారతి, డీఆర్‌ఓ సంగీత, ఎన్‌ ఐ సి అధికారి స్వర్ణలత, ఆర్డీఓలు సూరజ్‌ కుమార్‌, అనంత రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ుుుు-

Spread the love