అయోధ్య ప్రాణ ప్రతిష్ట: ఇండ్ల ముందు రంగోళి

నవతెలంగాణ –  మద్నూర్
సోమవారం నాడు అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి స్థలంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న సందర్భంగా దేశమంతటా గ్రామ గ్రామాన, వాడ వాడలో ఇంటింటా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇండ్ల ముందర రంగురంగుల రంగోలిలు వేసి, ప్రతి ఇంటి ముందర ఆకిళ్లలో అందాలతో తీర్చిదిద్దారు. మద్నూర్ మండల కేంద్రంలో ఒక ఇంటి ముందర వేసిన ముగ్గు అందరినీ ఆకర్షించింది.
Spread the love