ముంబయి : భారతదేశపు అతిపెద్ద బ్యాగ్ కంపెనీ అయిన బ్యాగ్‌జోన్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయినా లావీ స్పోర్ట్ బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. లావీ స్పోర్ట్ విస్తృత ఉత్పత్తులైన బ్యాక్‌ప్యాక్‌లు, డఫిల్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, వాలెట్లకు ప్రచారం కల్పించనున్నారు. డిజిటల్, సోషల్ మీడియాలో విస్తరించిన వాణిజ్య ప్రకటనల ద్వారా సరికొత్త సేకరణతో పాటు బ్రాండ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు కూడా రణవీర్ ప్రచారం చేయనున్నారని లావీ స్పోర్ట్ సిఇఒ, వ్యవస్థాపకుడు ఆయుష్ తైన్వాలా తెలిపారు.