అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

Rape accused should be severely punishedనవతెలంగాణ – ముధోల్
కోల్‌కత్తాలో  వైద్యారాలు పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ,గ్రామీణ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహిం చారు.ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆఖరి కి ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురి కావ డం బాధాకరమన్నారు.డాక్టర్ల పైన ఇ లాంటి సంఘటనలు పునరావృతం కా కుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నా రు.వెం టనే నిందితులను గుర్తించి ఉరిశిక్ష వేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం ర్యా లీగా వెళుతూ తాసిల్దార్ కార్యాలయం లో ఆర్ఐ నారాయణపటేల్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సాయి సువర్ధన్,మల్లి ఖార్జున్, రాహుల్,టీబీ నివారణ విభాగం సూపర్వైజర్ లాలయ్య,గ్రామీణ వై ద్యులు చాతారాజుదుర్గ ప్రసాద్, గంగాధర్ చం దినే, సిద్దిక్, ప్రభు త్వ, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love