భువనగిరిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు….

– సొంతగూటికి చేరిన కుంభం..
 – కుంభంఇంటిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి మంతనాలు..
నవతెలంగాణ – భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2019 సంవత్సరం ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుంచి పైల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి డి అంటే డి అనే రీతిలో రాజకీయం కొనసాగింది. కుంభ అనిల్ కుమార్ రెడ్డికి అప్పట్లో సరియైన అనుచరుగలం లేకపోవడంతో కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. కానీ ప్రస్తుతం కాకరమైన ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ చేసిన సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొంది అవకాశాలు ఉన్నాయని తెలియడంతో అరిష్టానం రంగంలోకి దిగి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్లు చర్చ కొనసాగుతుంది.
టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..
సుమారు రెండు నెలల క్రితం భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భువనగిరిలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నెల రోజులపాటు ప్రజలతో మమేకమై ప్రజలతో గడిపాడు. అనంతరం కుంబం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో చేరడంతో పైల శేఖర్ రెడ్డి విజయం పై ధీమాగా ఉన్నారు. ప్రజలతో గడిపే సమయాన్ని తగ్గించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో గత రెండు నెలలుగా విస్తృతస్థాయిలో చర్చ కొనసాగుతుంది..
కాంగ్రెస్ కండువా కపి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…
సునీల్ అండ్ కొనుగోలు టీం లో భువనగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కుంభ అనిల్ కుమార్ రెడ్డికి ఉన్నాయని రిపోర్టు అందడంతో స్వయంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జూబ్లీహిల్స్ లోని కుమార్ అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. చివరికి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కుంభం ఇంటికి చేరుకున్న అనుచరులు…
కాగా కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. కుంభ అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ ఆయనకు ప్రజాక్షేత్రంలో ఆదరణ తగ్గలేదని , మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. అధిష్టానం మంత్రాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోగతం కుంభం సొంతకూటికి చేరడానికి బాటలు వేస్తున్నాయి. రేవంత్ రెడ్డి మంతనాలు జరిపి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంభ అనిల్ కుమార్ రెడ్డితో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, పచ్చల కట్ట జగన్, ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్ , ఏ ర్పుల శ్రీను, గడ్డమీది వీరస్వామి గౌడ్ తో పాటుగా సుమారు 500 కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరిలో మరొకసారి బిగ్ ఫైట్ జరగనుంది.

 

Spread the love