నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యువ మోర్చా మీడియా కార్యశాల, ఎన్నికల సన్నాహాక సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ లేకుండానే సమావేశం ప్రారంభించడం పట్ల.. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, తరుణ్ చుగ్ ముందే ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కాసం వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.