– జిల్లా పౌర సరఫరాల అధికారి కె చందన్ కుమార్
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లాలోని రేషన్ కార్డుదారులందరు ఈ కేవైసీ నవీకరణ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరా ల అధికారి కే. చందన్ కుమార్ సూచించారు. మం గళవారం వరంగల్ జిల్లా ఈపాస్ టెక్నీషియన్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రేషన్ షాప్ డీలర్ల వద్ద రేషన్ కార్డుదారులు ఈకేవైసీ 100 శాతం డేటాను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ఈ కేవైసీ ప్రచార అవగాహనలో భాగం గా జిల్లా పౌరసరఫరాల , సహాయ పౌరసరఫరాల అధికారి ఉప తాసిల్దార్ వరంగల్ జిల్లాలోని వరం గల్ మండలంలో రేషన్ షాప్ నెంబర్ 71 ఇతర షాపులను దర్శించి ప్రజలను చైతన్య పరిచి ఈ కేవైసీ పైన అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో ఈ పాస్ డీసీ రాజుకుమార్ పాల్గొన్నారు.