రేషన్‌ ఈ- కేవైసీకి మరో అవకాశం

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,740 గ్రామ పంచాయతీలకు గానూ 2,081 రేషన్‌ దుకాణాలున్నాయి. ఇందులో మొత్తం 10,07,214 రేషన్‌ కార్డులుండగా, 29,85,553 మంది రేషన్‌ లబ్ధిదారులున్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల 7,96,023 మంది ఈ కేవైసీ చేయించుకోనట్లుగా అధికారవర్గాలు తెలుపుతున్నాయి.

Spread the love