నవతెలంగాణ – జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ షణ్ముఖరావు, హౌంగార్డు సతీష్‌లు గ్రామంలో పెట్రోలింగ్ చేపట్టారు. వంగర గ్రామానికి చెందిన బండారి స్వామి, ఓదెల మండలం పోత్కాపల్లి గ్రామానికి చెందిన రేవెల్లి కుమార్ ద్విచక్ర వాహనంపై బియ్యం మూటలు వేసుకుని రావడం చూసి వారిని ప్రశ్నించారు. గ్రామాలలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇక్కడ ఒకచోట నిలువ చేసుకున్నామని తెలుపగా ఆ స్థలానికి వెళ్లి వారు అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ రవి తెలిపారు.