ఈగల్‌గా రవితేజ

రవితేజ, సినిమాటోగ్రాఫర్‌ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్‌ ప్రాజెక్ట్‌ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ హౌస్‌లో చేస్తున్న విషయం విదితమే. మేకర్స్‌ సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్‌ ద్వారా విడుదల చేశారు.
రవితేజ మోస్ట్‌ వాంటెడ్‌ పెయింటర్‌. అతన్ని పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెదుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి అంటూ రవితేజ ఫేస్‌ని రివీల్‌ చేస్తూ ‘ఈగల్‌’ అనే టైటిల్‌ రావడం స్ట్రైకింగ్‌గా ఉంది. గ్లింప్స్‌ హీరో ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్‌ చేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, మధుబాల వంటి ప్రముఖ తారాగణం కూడా కనిపించారు. కావ్యా థాపర్‌ మరో కథానాయిక. విజువల్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఎక్స్‌ట్రార్డినరిగా ఉంది. కార్తీక్‌ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్లింప్స్‌ ద్వారా ఈచిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.

Spread the love