రవితేజ 75వ సినిమా ప్రారంభం..సంక్రాంతికి రిలీజ్ ..!

నవతెలంగాణ-హైదరాబాద్ : రవితేజ – శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ‘ధమాకా’ ఒక రేంజ్ లో వసూళ్ల సందడి చేసింది. రవితేజ అభిమానులను హుషారెత్తించింది. మళ్లీ రవితేజ నుంచి అలాంటి సినిమా వస్తే బాగుంటుంది .. మళ్లీ రవితేజ – శ్రీలీల కలిసి కనిపిస్తే కనువిందుగా ఉంటుందని అంతా అనుకున్నారు. అలా అనుకున్నవారి ముచ్చట దాదాపు తీరిపోయినట్టే అనుకోవాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగును కూడా మొదలెట్టేసింది. కెరియర్ పరంగా రవితేజకి ఇది 75వ సినిమా. సితార నాగవంశీ – సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయమవుతున్నాడు. మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. కంటెంట్ కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెబుతున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Spread the love