నవతెలంగాణ-హైదరాబాద్ : రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్వకత్వంలో వచ్చిన తాజా చిత్రం‘మిస్టర్ బచ్చన్’. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ప్రచారంలో భాగంగా ‘మాస్ మహా ట్రైలర్’ అంటూ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఈ నెల 15న బాక్సాఫీసు ముందుకు రానుంది.