నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ బదిలీ చేపట్టిన నేపథ్యంలో మండల తహశీల్దార్ గా కె.రవికుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ శ్రీనివాస్ బదిలీపై ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు. రైతులు,ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తహశీల్దార్ కార్యాలయంలో కలవాలని బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ సూచించారు.