విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవియాదవ్

 – శ్రీ కృష్ణ దేవాలయం శంకుస్థాపనకు అధిక సంఖ్యలో తరలిరావాలి
 – అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి రవియాదవ్
నవతెలంగాణ-వీణవంక : కరీంనగర్ లో ఈ నెల 7న నూతనంగా నిర్మించే శ్రీ కృష్ణ దేవాలయం శంకుస్థాపనకు యాదవులు అధిక సంఖ్యలో తరలిరావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన రవియాదవ్ యాదవ్ లను కోరారు. మండల కేంద్రంలోని బీరన్న ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కేంద్రంలో యాదవుల ఇలవేల్పైన శ్రీకృష్ణ  దేవాలయ నిర్మాణానికి మూడు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన ఉంటుందని, యాదవులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి స్థలం కేటాయించిన, జిల్లా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు  బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్  యాదవ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవి యాదవ్, ఇల్లంతకుంట మండల ప్రెసిడెంట్ గడ్డి రాములు, వీణవంక మండల ప్రెసిడెంట్ మర్రి స్వామి, ఇట్టవేన రాజయ్య యాదవ్, రంజిత్, శ్రీనివాస్, కుమార్, రాజ్ కుమార్, రవీందర్, రమేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love