RBI: మరో బ్యాంకు క్లోజ్.. లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ, కస్టమర్లపై తీవ్ర ప్రభావం



RBI: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో కోఆపరేటివ్ బ్యాంకు లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వద్ద అవసరమైన మూలధనం లేదని, ఒకవేళ మరింత కాలం ఆపరేషన్స్ కొనసాగిస్తే.. డిపాజిటర్లు దెబ్బతినే అవకాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. కాగా.. నిన్ననే పూణేకి చెందిన ఒక కోఆపరేటివ్ బ్యాంకు మూతపడింది. బ్యాంకింగ్ ఆపరేషన్స్‌ను ఇది క్లోజ్ చేసింది.

RBI: దేశంలో మరో కోఆపరేటివ్ బ్యాంకు మూత పడుతుంది. పూణేకు చెందిన రూపీ కోఆపరేటివ్ బ్యాంకు మూతపడిన ఒక్క రోజులోనే.. మరో బ్యాంకుపై ఆర్‌బీఐ వేటు వేసింది. మహారాష్ట్రలోని లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) రద్దు చేసింది. ఈ బ్యాంకులో డిపాజిట్ దారులకు రూ.5 లక్షల వరకు రిటర్ను చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
రిజర్వు బ్యాంకు ఆర్డర్‌తో లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఇక నుంచి ఎలాంటి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలు లేదు. ఆర్‌బీఐ ఈ నోటీసు జారీ చేసిన తర్వాత.. ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన వారు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు వద్ద అవసరమైన మూలధనం లేకపోవడంతో.. ఈ కోపరేటివ్ బ్యాంకు లైసెన్సును రద్దు చేసినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

Spread the love