టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..

నవతెలంగాణ – బెంగళూరు: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు ఆర్సీబీ vs సీఎస్కే జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచుల్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచులో ఆర్సీబీ గెలవడం చాలా ముఖ్యం. అధికూడా నెట్ రన్ రేట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ తీసుకునేది. అయితే ఈ మ్యాచ్ చెన్నై జట్టుకు కూడా అంతే కీలక అయినప్పటికీ ఒక వేల ఓడిపోయిన తక్కువ మార్జిన్ 18 పరుగుల లోపు తేడాతో ఓడిపోతే.. చెన్నై జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. ఇలాంటి కీలక మైన మ్యాచులో ఆర్సీబీ విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సి ఉంది.

Spread the love