నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రెష్‌గా రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ ఆర్ పీ సింగ్ అభిప్రాయపడ్డారు. విరాట్‌ను తప్ప అందర్నీ వదిలేయాలన్నారు. ‘కోహ్లీ జట్టుతోనే ఉండాలి. అతడి చుట్టూ టీమ్ నిర్మించాలి. మిగిలిన కీలక ఆటగాళ్లను RTMతో సొంతం చేసుకుంటే చాలు. సిరాజ్, పాటీదార్ వంటి కీలక ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయొచ్చు. ఆ జట్టులో ఇప్పుడున్న వారిలో విరాట్ తప్ప వేరెవ్వరూ రూ. 14-18 కోట్లు పలికే ఛాన్స్ లేదు’ అని తెలిపారు.